Chandrababu Letter DGP : కుప్పం ఘటనలపై డీజీపీకి చంద్రబాబు లేఖ

కుప్పం ఘటనలపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం పర్యటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపామని చెప్పారు.

CHANDRABABU

Chandrababu Letter DGP : కుప్పం ఘటనలపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం పర్యటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపామని చెప్పారు.

పోలీసులు తన పర్యటనకు పలుసార్లు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. తమ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పెద్దూరులో తనను పోలీసు బలగాలతో అడ్డుకున్నారు. తన పర్యటనకు భద్రత కల్పించడంలో జిల్లా ఎస్పీ విఫలం మయ్యారు.

Andra pradesh : కుప్పంలో చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు

తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టారని పేర్కొన్నారు. పలమనేరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేపటి పర్యటనకు అనుమతి ఇవ్వాలని డీజీపీని చంద్రబాబు కోరారు.