Chintamaneni Prabhakar Relief In High Court Over Sc St Atrocity Case
AP High Court : టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆ కేసులో తదుపరి చర్యలపై స్టే విధించింది. చింతమనేనిపై నమోదైన కేసులో తదుపరి చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. తనపై చింతలపూడి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంతో ప్రభాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని చింతమనేని ప్రభాకర్ తరుపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ఈ కేసుపై తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
కాగా..టీడీపీ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం పన్నులు..బిల్లుల పేరుతో చేస్తున్న దోపిడీపై ఫోకస్ పెట్టింది టీడీపీ. దీని కోసం స్వయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబే రంగంలోకి దిగారు. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగానే చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్రం అంతటా బాదుడే బాదుడు కార్యక్రమాల్లోటీడీపీ నేతలు పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పరిధిలోని వెంకంపాలెంలో కూడా గత సోమవారం నిరసన తెలియజేశారు.
Also read : YS Viveka Murder Case: వివేకా హత్య నిందితుల బెయిల్ పిటిషన్.. విచారణ ఎల్లుండికి వాయిదా
ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే స్థానిక సర్పంచి, వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని చింతమనేని వ్యాఖ్యలను తప్పుబట్టారు. టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ గొడవ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే చింతమనేని తనను కులం పేరుతో తిట్టాడని స్థానిక సర్పంచ్ టి. భూపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ నాయకులు కూడా వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు.
Also read : Ganta Srinivasa Rao : విశాఖ ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబుకు స్వాగతం పలికిన గంటా శ్రీనివాసరావు..
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో వైసీపీకి చెందిన సర్పంచ్ టి. భూపతి, ఉప సర్పంచ్ ఎస్.రమేష్ రెడ్డి తో పాటు మరి కొందరు నాయకులు ఆయుధాలతో టీడీపీ నాయకులను తిడుతూ కొట్టబోయారని ఆరోపించారు. దీంతో తమను తాము కాపాడుకున్నామని వారు తెలిపారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు వర్గాల నుంచి అందిన ఫిర్యాదును ఎస్ఐ తీసుకుని ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసినట్టు ఎస్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలియజేశారు.