పవన్ కల్యాణ్ తప్పుకుంటే పిఠాపురంలో కచ్చితంగా నేనే పోటీ చేస్తా- టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు

ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తామిద్దరం సీట్లు స్వాప్ చేసుకుంటామని పవన్ చెప్పారు. ఈ క్రమంలో వర్మ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.

Svsn Varma On Pithapuram

Svsn Varma : కాకినాడ జిల్లా పిఠాపురంలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయకపోతే తాను కచ్చితంగా బరిలో నిలుస్తానని ఆయన తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ మనసు మార్చుకుని కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ సీటు తనదేనని ఆయన అన్నారు. లేదంటే పవన్ ను భారీ మెజారిటీ గెలిపిస్తామన్నారు వర్మ.

నిన్న జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ ను ప్రకటించారు పవన్ కల్యాణ్. తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వెల్లడించారు. ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తామిద్దరం సీట్లు స్వాప్ చేసుకుంటామని పవన్ చెప్పారు. ఈ క్రమంలో వర్మ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఒకవైపు అధికార వైసీపీ పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు వ్యూహాలు పన్నుతుంటే.. మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం.. పవన్ కల్యాణ్ కనుక మనసు మార్చుకుని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోతే.. కచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా నేనే బరిలో ఉంటానని కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇచ్చారు.

బీజేపీ పెద్దలు తనను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కోరితే.. ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం అభ్యర్థిగా ఉన్న నేను స్వాప్ చేసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. పవన్ కల్యాణ్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే.. చంద్రబాబు మాటకు కట్టుబడి పవన్ ను గెలిపించుకుంటామన్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఒకవేళ పవన్ కల్యాణ్ కనుక మనసు మార్చుకుని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. కచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా తానే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని వర్మ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబుకి చెప్పడం జరిగిందని, మీకు కూడా అదే విషయం చెబుతున్నాను అని కార్యకర్తలతో అన్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. పవన్ కాకుండా మరెవరైనా పిఠాపురం నుంచి పోటీ చేస్తే తాను వారికి సపోర్ట్ చేయను అని వర్మ తేల్చి చెప్పారు.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కామెంట్స్..
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. పోటీలో పవన్ కాకుండా వేరే ఎవరున్నా.. కచ్చితంగా నేను పోటీలో ఉంటాను. పవన్ కల్యాణ్ మనసు మార్చుకుని ఎంపీగా వెళితే పిఠాపురం నుండి టీడీపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా. పవన్ పోటీలో ఉంటారని, గెలిపించి తీసుకురావాలని అధినేత చంద్రబాబు ఆదేశించారు. పిఠాపురం ప్రజలను ఓటు అడిగే హక్కు వైసీపీ నేతలకు లేదు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని వైసీపీ నేతలు ఓటు అడుగుతారు? ఎన్నికల నిబంధనల ప్రకారం వచ్చే నెల పెన్షన్లను వాలంటీర్లు ఇవ్వకూడదు. అధికారులే ఇవ్వాలి.

Also Read : పిఠాపురంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. పవన్ ఓటమికి సీఎం జగన్ బిగ్ ప్లాన్

 

ట్రెండింగ్ వార్తలు