పిఠాపురంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. పవన్ ఓటమికి సీఎం జగన్ బిగ్ ప్లాన్

పీఠాపురం నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.

పిఠాపురంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. పవన్ ఓటమికి సీఎం జగన్ బిగ్ ప్లాన్

Pitapuram constituency

Pitapuram constituency : పీఠాపురం నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళికను వైసీపీ అధిష్టానం సిద్ధం చేసింది. నియోజకవర్గం నుంచి ఇతర పార్టీల్లోని పలువురు నేతలు వైసీపీలో చేరుతున్నారు. ముద్రగడ పద్మనాభం, పిఠాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వంగ గీత ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రీజనల్ కో- ఆర్డినేటర్ మిథున్ రెడ్డిలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మండలాల వారిగా నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. గొల్లప్రోలుకు కన్నబాబు, యూ.కొత్తపల్లికి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్ కు మిథున్ రెడ్డి ఇంఛార్జిలుగా వ్యవహరించనున్నారు.

Also Read : పవన్ కల్యాణ్‌కి ఏంటి ఈ కర్మ?: ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్లు

పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫొకస్ పెట్టింది. ఈ నియోజక వర్గంలోని జనసేన, తెలుగుదేశం పార్టీల్లోని నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు దృష్టిసారించారు. ఈ క్రమంలో ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరనున్నారు.

అదేవిధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డితో ముద్రగడ పద్మనాభం, వంగా గీత భేటీ కానున్నారు. వీరి భేటీలో నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు మళ్లించేలా సీఎం జగన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 90వేలకుపైగా కాపు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ కాపు ఓటర్లను వైసీపీకి వైపుకు మళ్లిస్తే.. వైసీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగాఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓటర్లు, మెజార్టీ బీసీలు ఎలాగూ పార్టీకి ఉండగా ఉంటారని, తద్వారా నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం ఖాయమవుతుందని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Nara Lokesh : నారా లోకేశ్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు.. తనిఖీ అనంతరం ఏం చెప్పారంటే

ముద్రగడ పద్మనాభం సేవలను పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా వినియోగించుకునే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనా ముద్రగడతో జగన్ చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపై దృష్టిసారిస్తూనే ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేలా ముద్రగడకు కీలక బాధ్యతలను సీఎం జగన్ అప్పగిస్తారని సమాచారం.