Nara Lokesh : నారా లోకేశ్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు.. తనిఖీ అనంతరం ఏం చెప్పారంటే

తాడేపల్లి అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖీ కార్యక్రమానికి నారా లోకేశ్ వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు లోకేశ్ కాన్వాయ్ ను అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు.

Nara Lokesh : నారా లోకేశ్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు.. తనిఖీ అనంతరం ఏం చెప్పారంటే

Nara Lokesh

Updated On : March 20, 2024 / 10:21 AM IST

Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు, ఏపీసహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గత మూడు రోజుల క్రితం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ ను ఆపి పోలీసులు చెక్ చేశారు. కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని పోలీసులు లోకేశ్ కు చెప్పారు. కాన్వాయ్ లో ఉన్న కార్లు అన్నింటిని పోలీసులు చెక్ చేశారు.

Also Read : TDP MP Candidates : టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు.. 11 నియోజకవర్గాల అభ్యర్థులు వీరే?

తాడేపల్లి అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖీ కార్యక్రమానికి నారా లోకేశ్ వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు లోకేశ్ కాన్వాయ్ ను అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసులు ధృవీకరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీలో నాల్గో దశలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. పోలింగ్ మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

Also Read : 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల