Tdp Protest (1)
TDP fights on hike of electricity tariffs : ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ పోరు ఉధృతం చేస్తోంది. నేటి నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ ఆందోళనల్లో భాగంగా ఇంటింటికీ కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై పెను భారం పడనుందని టీడీపీ ఆరోపిస్తోంది. పెరుగుతున్న విద్యుత్ కోతలు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదని వాదిస్తోంది.
ఈ క్రమంలో విద్యుత్ లేకపోయినా.. జనం ఇళ్లల్లో వెలుగు నింపేలా తాము కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేసేందుకు సిద్ధపడినట్లు ఆ పార్టీ తెలిపింది. ఉగాది పండుగ చేసుకోనీయకుండా రాష్ట్ర ప్రజల జీవితాల్లో సీఎం జగన్ చీకట్లు నింపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. కొత్త సంవత్సరం రోజున ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాల్సిన ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని కల్పించారని విమర్శించారు.
AP Electricity Charges : ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు.. ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
చీకట్లలో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు.. పేదల తరపున ప్రజాక్షేత్రంలో పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మెడలు వంచి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేవరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తొలిదశలో కొవ్వొత్తుల, అగ్గిపెట్టెల పంపిణీ నిర్వహించి నిరసన తెలియజేస్తామన్నారు.