AP Electricity Charges : ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు.. ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంల ప్రతిపాదనలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ పెంచింది.

Ap Electricity Charhge
AP Electricity Charges : ఏపీ ప్రజలకు విద్యుత్ షాక్. ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరుగనున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంల ప్రతిపాదనలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ పెంచింది. ఇక ప్రభుత్వ ఆమోదమే తరువాయి అన్నట్లుగా చెప్పవచ్చు.
0-30 యూనిట్ల శ్లాబ్ కు యానిట్ కు 45 పైసలు పెంచారు. 31-75 యూనిట్ల శ్లాబ్ కు యానిట్ కు 91 పైసలు పెరిగింది. 76-125 యానిట్ల శ్లాబ్ కు యానిట్ కు రూ.1.40 పెంచారు. 126-225 యూనిట్ల శ్లాబ్ యూనిట్ కు రూ.1.57 పెంచనున్నారు.
Andhra Pradesh : విద్యుత్ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్..కరెంట్ కోతలు తప్పవా?
226-400 యానిట్ల శ్లాబ్ కు యూనిట్ కు రూ.1.16 పెంచారు. 400పైన యూనిట్ కు 55 సైసల చొప్పున పెరుగనుంది. డిస్కంలు ప్రతిపాదించని శ్లాబ్ ల్లోనూ ఈఆర్సీ మార్పులు చేసింది.
రూ.1,500 కోట్ల ఆదాయమే లక్ష్యంగా విద్యుత్ ఛార్జీజు పెంచినట్లు ఏపీఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డి తెలిపారు. తీయ విద్యుత్ విధానాన్ని అనుసరించే ఛార్జీలు పెంచినట్లు చెప్పారు.