స్పృహతప్పి పడిపోయిన భూమా అఖిలప్రియ.. ఆసుపత్రికి తరలింపు

ఆమె ఇవాళ దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో మూల పెద్దమ్మ దేవరలో పాల్గొన్న సమయంలో స్పృహతప్పి పడిపోయారు.

Bhuma Akhila Priya

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఇవాళ దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో మూల పెద్దమ్మ దేవరలో పాల్గొన్న సమయంలో స్పృహతప్పి పడిపోయారు.

బీపీ పెరగడంతో ఆమె స్పృహతప్పినట్లు తెలుస్తోంది. అఖిలప్రియను అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆసుపత్రి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా వస్తున్నారు.

Also Read: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు..

కాగా, మూల పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా అఖిలప్రియ నిన్న కూడా అమ్మవారికి దర్శించుకున్నారు. ప్రజలు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, మెడికల్ క్యాంపు, భక్తులకు వసతి ఏర్పాట్లు వంటి అన్నింటిని ఆమె పరిశీలించారు.

Bhuma Akhila Priya

మూల పెద్దమ్మ దేవర 11 ఏళ్ల తర్వాత జరుగుతోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన దేవర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. నిన్న దేవీ ఉత్సవం జరగగా, ఇవాళ గండదీప పూజలు జరుగుతున్నాయి. రేపు ఎల్లమ్మ పూజలు ఉంటాయి. దీంతో దేవర ముగుస్తుంది. దేవరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.