సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు..

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు..

Kommineni Srinivasa Rao

Updated On : June 9, 2025 / 2:17 PM IST

Kommineni Srinivasarao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ చర్చలో భాగంగా అమరావతి ప్రాంత మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ.. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్‌ కృష్ణంరాజుపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్లు‌తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన తుళ్లూరు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని శ్రీనివాసరావును తరలించనున్నారు. మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.