Atchannaidu
Atchannaidu Fire on YCP govt : రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉంది అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. అమరావతితో అచ్చెన్నాయుడు మాట్లాడుతు.. ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నించారు.
పాడిరైతుల ప్రగతికి కృషిచేసే నరేంద్ర.. రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా..? ఇటువంటి అక్రమ కేసులో వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారని అన్నారు. సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని అది ఫలించకపోవటంతో దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలా ప్రశ్నించనవారిని వేధించటమే పనిగా ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు
టీడీపీ నాయకులు అక్రమ హత్యాయత్నం కేసులకు భయపడతారా జగన్ రెడ్డి..? అలా భయపడేవారు టీడీపీ నేతలు కాదని తెలుసుకోవాలి అన్నారు. మీకు ఇంకా 5 నెలలే సమయం ఉంది..ఇక మీరు ఎవరిపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..మీరు పెట్టే కేసులకు ఎవ్వరు భయపడరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతున్నారన్నారు. ప్రజలే మిమ్మల్ని రాష్ట్రం నుంచి తన్ని తరుముతారు అని అన్నారు.
కాగా..మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఆయనపై చేబ్రోలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ధూళిపాళ్లపై అక్రమంగా కేసు బనాయించారు అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.