Dhulipalla Narendra : ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు

రైతులు చేబ్రోలు మండలం వడ్ల మామిడిలోని డెయిరీ వద్దకు వెళ్లగా ఘర్షణ జరిగిందని చెప్పారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు.

Dhulipalla Narendra : ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు

Dhulipalla Narendra Kumar

Updated On : November 17, 2023 / 5:02 PM IST

case registered against Dhulipalla Narendra Kumar : మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఆయనపై చేబ్రోలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ సీఐ రాంబాబు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు అక్కడ సంగం డెయిరీ అధ్వర్యంలో పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారని తెలిపారు.

వాటికి సంబంధించిన బకాయిలు అడిగేందుకు బుధవారం రైతులు చేబ్రోలు మండలం వడ్ల మామిడిలోని డెయిరీ వద్దకు వెళ్లగా ఘర్షణ జరిగిందని చెప్పారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు. గురువారం రాత్రి 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, 15వ నిందితుడిగా జానకిరామయ్య పేర్లను ఎఫ్ ఐఆర్ లో చేర్చినట్లు చెప్పారు.

CM Jagan : అసైన్డ్ భూములపై పేదలకే పూర్తి హక్కులు : సీఎం జగన్