టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు కరోనా పాజిటివ్

  • Publish Date - August 28, 2020 / 10:18 AM IST

తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండమని డాక్టర్ సూచించినట్లు ఆయన వెల్లడించారు.



ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటానని బుద్ధా వెంకన్న ప్రకటించారు. మా అధినేత చంద్రబాబు అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు కోరుతున్నారు. ట్విట్టర్‌లో విష్ చేస్తున్నారు.