Galla Jayadev : ఏపీలో వర్షాలు కల్గించిన నష్టంపై ప్రధాని మోడీ, అమిత్ షాకు గల్లా జయదేవ్ లేఖ

ఆంధ్రప్రదేశ్ లో తుఫాను, వర్షాలు, వరదలు నష్టంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ లేఖ రాశారు.

Galla Jayadev’s letter to Modi and Amit Shah : ఆంధ్రప్రదేశ్ లో తుఫాను, వర్షాలు, వరదలు నష్టంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ లేఖ రాశారు. తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని లేఖలో కోరారు. తుఫాను కారణంగా రాయలసీమలో ప్రాణ నష్టం, పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయని అన్నారు.

రాష్ట్రంలో రవాణా స్తంభించిందని, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించండి.. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించండి..అంటూ లేఖలో వివరించారు. రైలు, రోడ్డు సౌకర్యాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని గల్లా జయదేవ్ లేఖలో కోరారు.

Thatha Madhu : స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా తాత మధు నామినేష‌న్

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 24 మంది మృతి చెందారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అయితే అనధికారికంగా 50 మంది దాకా ఆచూకీ తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని.. 172 మండలాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపించింది.

ప్రాథమిక అంచనాల ప్రకారం 4 జిల్లాల్లో కలిపి సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు 28 చెరువులు, కుంటలు, కాలువలు తెగిపోయాయి. 188 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక్క కడప జిల్లాలోనే మూడున్నర వేల పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఎడతెరపిలేని వర్షాలతో 1,316 గ్రామాలను వరద ముంచెత్తింది.

ట్రెండింగ్ వార్తలు