×
Ad

TDP Lokesh Padayatra : ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా? నారా లోకేశ్

ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.

  • Published On : January 29, 2023 / 03:30 PM IST

Lokesh

TDP Lokesh Padayatra : ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మహిళలు లోకేశ్ కు మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. దిశ చట్టమే లేకుండా పీఎస్ లు, వాహనాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా మంత్రి రోజా మహిళలను అవమానించారని పేర్కొన్నారు.

రోజా మాట్లాడుతూ ‘నాకు చీరలు, గాజులు పంపిస్తానంది.. ఇది మహిళలను అవమాన పరిచినట్లు కాదా’ అని అన్నారు. ఒక మహిళా మంత్రే ఈ విధంగా మాట్లాడితే వీధి రౌడీలు ఎంత చెలరేగిపోతారో ఆలోచించాలన్నారు. వెంటనే రోజా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు చేసిన ఎంత మందికి 21 రోజుల్లో ఉరి శిక్ష వేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల 8 నెలలు గుడుస్తున్నా.. ఒక ఇల్లైనా నిర్మించారా అని నిలదీశారు.

Nara Lokesh : చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? మంత్రి రోజాను టార్గెట్ చేసిన లోకేశ్

మహిళల తాళిబొట్టును కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. మద్యం తయారు చేస్తున్నారు,. మద్యం సీసా నింపుతున్నారని, మద్యం సీసా రవాణా చేస్తున్నారు… మద్య సీసా కూడా అమ్ముతున్నారని పేర్కొన్నారు. 2024లో ఏ ముఖం పెట్టుకుని తెలుగింటి ఆడ పడచులను ఓట్లు అడుతారని సీఎం జగన్ ను ప్రశ్నించారు. గత 3 సంవత్సరల 8 నెలల్లో 9 వందల మంది మహిళలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు.