Nara Lokesh Padayatra Route Map : లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు..కుప్పం వరదరాజస్వామి దేవాలయం వద్ద పాదయాత్రకు శ్రీకారం

లోకేశ్ ‘యువగళం’మహాపాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు..కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి దేవాలయం వద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు లోకేశ్.

Lokesh-yuvagalam-mahapadayatra Route Map : టీడీపీ నేత నారా లోకేష్ ‘యువగళం’మహాపాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు అయ్యింది. పాదయాత్ర తొలి మూడు రోజులు టీడీపీ అధినేత,మాజీ సీఎం, తండ్రి అయిన చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోనే సాగనుంది. కుప్పం నియోజక వర్గంలోని లక్ష్మీపురంలోని వరదరాజస్వామి దేవాలయం నుంచి లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 27 మధ్యాహ్నాం 12గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి.

కాగా…ప్రజలతో మమేకం కావటానికి నారా లోకేశ్ పాదయాత్ర 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంకానుంది. . చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ పాద్రయాత్ర సాగుతుంది. ఆ పాదయాత్రతో లోకేశ్ ఏడాదిపాటు ప్రజల మధ్యే ఉండేలా రూట్ మ్యాప్ సిద్దమైనట్లుగా తెలుస్తోంది. యువనేత అయిన లోకేశ్ రాష్ట్రంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. యువత సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభం

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవిధంగా పాదయాత్ర ప్రణాళిక రూపొందించింది టీడీపీ. ఈ పాదయాత్రలో యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్ర కోసం పార్టీలోని యువనేతలు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. దాదాపు ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగే ఈ యాత్రంలో లోకేశ్ ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు తెలుసుకోనున్నారు. కానీ ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం ఈ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఏపీలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైంది. అన్ని పార్టీలు వారి వారి క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. వాహనాలను సిద్దం చేసుకోవటమే కాదు ప్రచారాలు కూడా చేపట్టారు. ఇప్పటికే టీడీపీ పలు ప్రాంతాల్లో రోడ్ షోలు..ర్యాలు వంటి కార్యక్రమాలతో ముందుకెళుతుంది. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా..వాహనాలను అడ్డుకుంటున్నా చంద్రబాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళుతునే పర్యటలతో ముందుకెళుతున్నారు.

మరోపక్క జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తన ప్రచార రథాన్ని వినూత్నం సిద్ధం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. తన ఎన్నికల ప్రచారం రథానికి ‘వారాహి’ అని పేరు కూడా పెట్టారు. ఈ వారాహిపై వైసీపీ నేతల విమర్శలు..ఏపీలో వారాహిని తిరగనివ్వం అంటూ విమర్శలు కొనసాగుతున్నాయి. కానీ పవన్ మాత్రం తగ్గకుండా తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నారు. ఇలా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు