Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభం

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర సాగుతుంది.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభం

Updated On : November 11, 2022 / 1:34 PM IST

Nara Lokesh: టీడీపీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

కనీసం ఏడాదిపాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా లోకేష్ పాదయాత్ర చేస్తారు. రాష్ట్రంలో రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవిధంగా పాదయాత్ర ప్రణాళిక రూపొందించింది టీడీపీ. ఈ పాదయాత్రలో యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్ర కోసం పార్టీలోని యువనేతలు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు.

దాదాపు ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగుతుంది. అయితే, ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం ఈ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.