Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో భేటీ కానున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని.. పవన్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మైత్రి, ఏపీ రాజకీయాలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

Updated On : November 11, 2022 / 8:48 AM IST

Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి విశాఖలోని ఐఎన్ఎస్ చోడాలో రాత్రి 08.30 గంటలకు ప్రధానితో పవన్ సమావేశమవుతారు. 15 నిమిషాలకుపైగా ఇరువురూ ఏచర్చలు జరుపుతారు.

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‪కు ప్రధాని మోదీ అపాయింట్‪మెంట్ ఖరారు

ఈ భేటీలో పీలోని రాజకీయ పరిస్థితులతోపాటు అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. బీజేపీ-జసనేన మైత్రి, బీజేపీ రోడ్ మ్యాప్, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇటీవలి విశాఖపట్నం ఘటన వంటి అంశాల్ని ప్రస్తావించే అవకాశం ఉంది. కొంతకాలంగా బీజేపీ-జనసేన మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాను కోరినట్లుగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని పవన్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నేతలు గతంలోనే స్పందించారు. బీజేపీకి రోడ్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చామని, ఏమైనా ఉంటే ఢిల్లీ పెద్దలను అడిగి తెలుసుకోవాలని జనసేనకు సూచించారు. తాజాగా చంద్రబాబు-పవన్ భేటీలో కూడా టీడీపీతో కలిసి వెళ్లేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది.

Afghanistan: పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ.. అఫ్గనిస్తాన్‌లో కొత్త రూల్

ఈ నేపథ్యంలో ప్రధానితో భేటీ అవుతున్న దృష్ట్యా చంద్రబాబుతో కలిసి ప్రజా ఆందోళనల అంశాల్ని తీసుకెళ్తారా.. లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానితో భేటీ కోసం పవన్ కల్యాణ్ సాయంత్రం ఐదు గంటలకు విశాఖ చేరుకుంటారు. ఇక్కడ పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు బస చేస్తారు.