Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‪కు ప్రధాని మోదీ అపాయింట్‪మెంట్ ఖరారు

Pawan Kalyan: రేపు విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ క్రమంలో మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రాత్రి 8.30గంటలకు విశాఖ ఐఎన్ఎస్ చోళాలో 15 నిమిషాలు పవన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై, బీజేపీ - జనసేన మైత్రి, బీజేపీ రోడ్ మ్యాప్ పైనా మోదీతో పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.