Palle Raghunatha Reddy : నిన్న కేసీఆర్, నెక్ట్స్ జగనే- పల్లె రఘునాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా వ్యవహరించ లేదు. ఇంత అహంకారం, నిరంకుశంగా వ్యవహరించే వారు ఎవరూ లేరు.

Palle Raghunatha Reddy And CPI Ramakrishna (Photo : Facebook)

వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వైసీపీ అని, దాన్ని వదిలించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు చేసిన కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపించారు అని ఆయన అన్నారు. ఏపీలో సంక్షేమం ముసుగులో దోపిడీ తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 100 శాతం వైసీపీ ఓటమి ఖాయం అన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యల ప్రదేశ్ గా మార్చిన ఘనత సీఎం జగన్ దే అని ధ్వజమెత్తారాయన. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదని వాపోయారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న సీఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడీసీ మండలంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

కేసీఆర్ పరిస్థితి జగన్‌కు కూడా వస్తుంది- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఛాలెంజ్ చేసి చెబుతున్నా. జగన్ ఉండగా పోలవరం పూర్తి కాదు. ఇంత అహంకారం, నిరంకుశంగా వ్యవహరించే వారు ఎవరూ లేరు. తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే జగన్ కు కూడా పడుతుంది. రాత్రికి రాత్రే కట్టుకున్న బంగ్లాల నుంచి జగన్ పారిపోతాడు. రాష్ట్రంలో ఓవైపు తుపాను, మరోవైపు కరవుతో అల్లాడిపోతున్నారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లి షో చేస్తున్నారు.

రైతులు కష్టాల్లో ఉన్నారన్న కనీస బాధ సీఎం జగన్ కు లేదు. 460 మండలాల్లో తీవ్ర కరవు ఉంటే.. 103 మండలాల్లో కరవు ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా వ్యవహరించ లేదు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 11న ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశం అవుతాం. 14న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపడతాం.

Also Read : టీడీపీ-జనసేనకు వైసీపీ చెక్..! కాపులను తమవైపు తిప్పుకునేలా వ్యూహం..!

ట్రెండింగ్ వార్తలు