×
Ad

Pattabhi Arrest : టీడీపీ నేత పట్టాభి అరెస్టు

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంటి వద్ద పట్టాభిని అరెస్టు చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Published On : October 20, 2021 / 09:40 PM IST

Pattabhi Ram

Pattabhi Ram : టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంటి దగ్గరే పట్టాభిని అరెస్టు చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభి ఇంటి వద్ద ఉన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు పంపించేశారు. బారికేడ్లు పెట్టి.. అక్కడకు ఎవరినీ రాకుండా గట్టి బందోబస్తు పెట్టారు. దీంతో అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపిస్తోంది.

పట్టాభిని అరెస్టు చేస్తారన్న వార్తలతో ఈ సాయంత్రం  నుంచి వాతావరణం హీటెక్కింది. పట్టాభిని అరెస్ట్ చేసేందుకు రాత్రి 9 గంటల టైంలో పోలీసులు ఆయన ఇంటికి వద్దకు వెళ్లారు. ఆ టైంలో పట్టాభి తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉన్నారు. పట్టాభి బయటకు రావాలని మైక్ లో పోలీసులు కోరారు. కానీ ఆయన బయటికి రాలేదు. దీంతో పోలీసులు తలుపులు పగల గొట్టి ఇంట్లోకి వెళ్లారు. అనంతరం పట్టాభిని అరెస్టు చేశారు.

Read This : Nara Lokesh : డ్రగ్ టెస్టుకు నేను సిద్దం.. మరి మీరు.. నారా లోకేశ్ సవాల్

పట్టాభి అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదు అందుకున్న విజయవాడ పోలీసులు… పట్టాభి ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

తన భర్త పట్టాభి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. ఆయనకు ఏది జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత అన్నారు ఆయన భార్య. 120 బీ సెక్షన్ కింద అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారని.. ఆయనేమైనా టెర్రరిస్టా అని ఆమె ప్రశ్నించారు.

అరెస్ట్, పోలీసులు రావడానికి ముందు పట్టాభి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని… ఇప్పటివరకు తన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని ఆయన చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.