Nara Lokesh : డ్రగ్ టెస్టుకు నేను సిద్దం.. మరి మీరు.. నారా లోకేశ్ సవాల్

బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. బూతులకు వైసీపీనే యూనివర్శిటీ. చంద్రబాబును, ప్రతిపక్ష నేతలను, ఉద్యోగులను బూతులు తిట్టిన వారినేం చేశారు..? కేసులెందుకు పెట్టలేదు.

Nara Lokesh : డ్రగ్ టెస్టుకు నేను సిద్దం.. మరి మీరు.. నారా లోకేశ్ సవాల్

Nara Lokesh

Nara Lokesh : ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ నేత పట్టాభి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగడం.. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. తాజాగా అధికార పార్టీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.

Rose Tea : బరువును తగ్గించే రోజ్ టీ

”బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. బూతులకు వైసీపీనే యూనివర్శిటీ. చంద్రబాబును, ప్రతిపక్ష నేతలను, ఉద్యోగులను బూతులు తిట్టిన వారినేం చేశారు..? కేసులెందుకు పెట్టలేదు. గిద్దలూరులో ఎమ్మెల్యేని నిలదీసినందుకు దళిత యువకుడ్ని చంపేశారు. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటించాలి. పార్టీ కార్యాలయంపై దాడి చేసి తలలు పగల కొడితే హత్యాయత్నం కేసు పెట్టారు. కానీ సీఐను జాగ్రత్తగా అప్పగిస్తే హత్యాయత్నం కేసా..? చంద్రబాబుకు ఓపిక ఎక్కువ.. నేను అలా కాదు.. వడ్డీతో సహా చెల్లిస్తాం. దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టం. పార్టీ కార్యాలయంపై దాడి కాదు.. దేవాలయంపై దాడి చేశారు. అధికారులే మఫ్టీలో వచ్చి దేవాలయంపై దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ పై మేం పోరాడుతుంటే పక్క రాష్ట్రం సీఎం స్పందిస్తే.. ఏపీ సీఎం మాత్రం స్పందించడం లేదు” అని లోకేశ్ మండిపడ్డారు.

Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పైనా లోకేశ్ ఫైర్ అయ్యారు. ”డీజీపీ పోస్టింగ్ కోసం చంద్రబాబుకు గతంలో సవాంగ్ ఫోన్లు చేయలేదా..? గౌతమ్ సవాంగ్ లాంటి వారి వల్ల ఏపీ పోలీసులకు చెడ్డ పేరు వస్తోంది. దాడి చేసి పారిపోయారు.. ఆ సమయంలో డీఎస్పీనే దగ్గరుండి సాగనంపారు. దాడి చేసిన వాళ్లు.. వాళ్ల కార్యాలయం ముందు నుంచే వెళ్లారు.. వచ్చారు. దాడులు చేసిన వారు.. తన కార్యాలయం ఎదురుగా వెళ్తోన్నా.. పట్టుకోలేకుంటే.. ఆ చొక్కా ఎందుకు..? డీజీపీ ఖాకీ చొక్కా విప్పి వైసీపీ చొక్కా వేసుకుంటే మంచిది.

Flipkart Discount Offer: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్.. చౌకగా 5G స్మార్ట్ ఫోన్!

వెతికితే డీజీపీ ఇంట్లోనే డ్రగ్స్ దొరుకుతుందేమోననే సందేహం వస్తోంది. గంజాయి రవాణ.. సాగు జరుగుతోంటే ఈ డీజీపీ ఏం చేయలేకపోతున్నారు. కానీ.. పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి కాల్పులు జరపాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యేలే డ్రగ్ ట్రేడింగ్ లో ఉన్నారు. వాళ్ల ఫ్యామిలీ సభ్యులే డ్రగ్స్ వినియోగిస్తున్నారు. డ్రగ్ టెస్టుకు నేను సిద్దం.. మరి మీరూ సిద్ధమేనా?” అని సవాల్ విసిరారు లోకేష్. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిపోయిందని లోకేశ్ ఆరోపించారు.