Pattabhi : పట్టాభికి బెయిల్ వస్తుందా?

టీడీపీ నేత పట్టాభి బెయిల్‌, పోలీసుల కస్టడీ పిటిషన్‌లపై ఇవాళ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. పట్టాభి తరపు న్యాయవాది నిన్న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Pattabhi bail and police custody petitions : టీడీపీ నేత పట్టాభి బెయిల్‌, పోలీసుల కస్టడీ పిటిషన్‌లపై ఇవాళ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. పట్టాభి తరపు న్యాయవాది నిన్న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు పోలీసులు కూడా పట్టాభి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఈ రెండు పిటిషన్‌లపై నేడు కోర్టు విచారణ జరపనుంది.

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పట్టాభికి విజయవాడ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నవంబర్‌ 2 వరకు ఆయన రిమాండ్‌లోనే ఉండనున్నారు. పట్టాభిని భారీ పోలీసు బందోబస్తు నడుమ మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. పట్టాభిని ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందో పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Pattabhi : మచిలీపట్నం సబ్‌జైలుకు పట్టాభి.. 14రోజుల రిమాండ్

పట్టాభిని అరెస్ట్‌ చేయకపోతే ఆయన.. మరింత బెదిరింపులకు దిగే అవకాశముందన్నారు. పట్టాభి వ్యాఖ్యలతో ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని కోర్టుకు చెప్పారు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. పట్టాభి కుట్రను మరింత పరిశోధించాల్సి ఉందన్న పోలీసులు.. ఆయనకు నేరస్వభావం ఉందని రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు