Pattabhi : మచిలీపట్నం సబ్‌జైలుకు పట్టాభి.. 14రోజుల రిమాండ్

పట్టాభికి బెయిల్‌ ఇవ్వడం కంటే.. జ్యుడీషియల్‌ కస్టడీకి పంపడమే సరైన చర్య ని కోర్టులో వాదనలు వినపించారు ప్రభుత్వ తరఫు న్యాయవాది.

Pattabhi : మచిలీపట్నం సబ్‌జైలుకు పట్టాభి.. 14రోజుల రిమాండ్

Pattabhi

Pattabhi :  ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో.. ఆయన్ను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షలు చేయించిన తర్వాత…. పట్టాభిని విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు.

Pattabhi Wife: నా భర్తకు ఏమైనా జరిగితే.. వారిదే బాధ్యత..!

2021 అక్టోబర్ 20 బుధవారం రాత్రి పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు… ఈ ఉదయం విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిపై న్యాయమూర్తికి వివరణ ఇచ్చుకున్నారు పట్టాభి. ప్రభుత్వంపైన గానీ.. సీఎంపైన కానీ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు.

Read This Chandrababu: దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!

ఐతే.. పట్టాభి తరచుగా నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం పట్టాభి బెయిల్ పై ఉన్నారని.. జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. బెయిల్‌పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్‌ ఆంక్షలను పాటించడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానేనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనీ.. రాష్ట్రంలో అలజడి, అల్లర్లు సృష్టించాలన్నదే పట్టాభి లక్ష్యమని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు చెప్పారు. న్యాయ, పోలీస్‌ వ్యవస్థలను పట్టాభి ఖాతర్‌ చేయడం లేదనీ.. ఏం పీక్కుంటారో పీక్కోండని రాజ్యాంగ వ్యవస్థలకు పట్టాభి సవాల్ చేస్తున్నారని అన్నారు. స్వప్రయోజనం, రాజకీయ ప్రయోజనాల కోసమే.. పట్టాభి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పట్టాభికి బెయిల్‌ ఇవ్వడం కంటే.. జ్యుడీషియల్‌ కస్టడీకి పంపడమే సరైన చర్య ని కోర్టులో వాదనలు వినపించారు ప్రభుత్వ తరఫు న్యాయవాది.