Yanamala (1)
TDP Leader Yanamala : ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చేసింది జగన్‌ది ఛాయ్, బిస్కెట్ కేబినెట్.. గతంలో ఉన్నది పప్పెట్ కేబినెట్ అంటూ సెటైర్ వేశారు. జగన్ కేబినెట్ లో మంత్రులకు స్వేచ్ఛ లేదని, ప్రజల్లో వైసీపీ పట్ల నెగిటీవ్ ఉందని..అందుకే పార్టీలో కూడా కొంత మంది తిరగబడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పార్టీలో ఒత్తిళ్లకు జగన్ లొంగక తప్పనిసరైందని.. వైసీపీలో అసంతృప్తి మొదలైందన్నారు. జగన్ పై తిరగబడుతున్నారని ఇటీవల జరిగిన పరిణామాల ద్వారా అర్ధమవుతుందోనని తెలిపారు. 2022, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కిచెన్ కేబినెట్ లోనో.. సలహదారుల బృందంలోను బీసీలు ఎందుకు లేరని ప్రశ్నించారు.
Read More : AP New Ministers: సెక్రటేరియట్‌లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం
నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కేబినెట్ లలో బీసీలకు ప్రాధాన్యత లేదన్నారు. పెత్తనం లేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారు..? ఈ కేబినెట్ లో బడుగులకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని విమర్శించారు. బడుగులకు ఎంత మందికి చోటు కల్పించామనే దాని కంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేదే ముఖ్యమని. జగన్ కేబినెట్ లో పాత బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసేసి.. కొత్త వారికి ఇచ్చారన్నారు. పవర్, మనీ రెండూ జగన్ వద్దే ఉందని పేర్కొన్న ఆయన సజ్జల వ్యవహార శైలిని ఎండగట్టారు. సీఎం సన్నిహితుడైనంత మాత్రానా మంత్రులను డిక్టేట్ చేస్తారా అని నిలదీశారాయన. కేబినెట్ లో బీసీలు ఉండాలనే ఉద్ధేశ్యంతో వారికి పదవులు కట్టబెడుతున్నట్లు.. జగన్ ఒక డెమోక్రాటిక్ డిక్టేటర్ అని తెలిపారు.
Read More : GVL Narasimharao: కొత్త మంత్రులంతా ఉత్తుత్తి మంత్రులే: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
టీడీపీ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భావంతోనే.. బీసీలకు ప్రాతినధ్యం ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో చంద్రబాబు తమలాంటి వారితో సంప్రదింపులు జరిపే వారని తెలియచేశారు. తర్వాతే ఆయన నిర్ణయాలు తీసుకొంటారని..కానీ..ఇక్కడ జగన్ ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మరోసారి విమర్శించారు.