AP New Ministers: సెక్రటేరియట్‌లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం

ఐదో బ్లాక్‌లో 211 చాంబర్‌లో రవాణా శాఖ మంత్రి బాధ్యతలను పినిపే విశ్వరూప్ చేపట్టగా అదే బ్లాక్‌లోని 215 చాంబర్ లో బీసీ వెల్ఫేర్, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెల్లుబోయిన..

AP New Ministers: సెక్రటేరియట్‌లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం

Aop New Ministers

AP New Ministers: సీఎం జగన్ కొత్త కేబినెట్‌లో నయా మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. మంగళవారం సెక్రటేరియట్ వేదికగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు అందుకున్నారు.

ఐదో బ్లాక్‌లో 211 చాంబర్‌లో రవాణా శాఖ మంత్రి బాధ్యతలను పినిపే విశ్వరూప్ చేపట్టగా అదే బ్లాక్‌లోని 215 చాంబర్ లో బీసీ వెల్ఫేర్, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. గనులు, విద్యుత్, అటవీ, పర్యవరణ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెక్రటేరియట్ మూడవ బ్లాక్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.

“సీఎం ఇంత మంచి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. మూడు శాఖలు కేటాయించి నాపై మరింత బాధ్యత పెంచారు. సీఎంకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత్రికేయుల మిత్రుల కష్టనష్టాల గురించి నాకు మంచి అవగాహన ఉంది. పాత్రికేయుల సమస్యలను ఎప్పటికీ అప్పుడు సీఎం దృష్టికి తీసుకొని వెళతాను. పాత్రికేయుల సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేస్తాను”

“బీసీల కోసం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సామజిక విప్లవం సృష్టించారు. మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆశయలతో సీఎం పాలన కొనసాగిస్తున్నారు. బీసిలకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఓ సువర్ణ యుగం నడుస్తుంది. సీఎంకు ఎంతో ఇష్టమైన బీసీ శాఖను నాకు అప్పగించడం, మరోసారి ఈ శాఖ కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది”

Read Also : ఏపీ నూతన మంత్రివర్గం.. ప్రమాణం చేసిన మంత్రులు వీరే…

“రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదులోనే సినీపరిశ్రమ ఉండిపోయింది. సినీపరిశ్రమకు మన రాష్ట్రంలో సహయసహకారాలు అందించేందుకు ఎంతో సానుకూలంగా ఉన్నారు. సినిమా షూటింగ్‌లు చేసుకోవడానికి మన రాష్ట్రంలో మంచి లోకేషన్స్, వనరులు ఉన్నాయి. ఇక్కడే షూటింగ్ లు జరిగే విధంగా ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలు అందించడానికి సిద్దంగా ఉంది”

“సినీపరిశ్రమ కూడా సినిమా షూటింగ్‌లు, స్టూడియోలు స్థాపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జరిగే సంక్షేమ పాలనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలను కట్టడి చేయాల్సిన బాధ్యత నాపై‌ ఉంది”

– మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ