Yarapathineni Srinivasa Rao : చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ దిద్దుకోలేని తప్పు చేశారు : యరపతినేని శ్రీనివాస్

పరిపాలన చేతగాని వ్యక్తి, లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి, పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి జగన్. అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబుని జైలుకి పంపారు చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారు అంటూ మండిపడ్డారు.

yarapathineni srinivasa rao

Chandrababu arrest..yarapathineni srinivasa rao : చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని..ఏపీలో సైకో పాలన జరుగుతోంది అంటూ మండిపడుతున్నారు. ఈక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ (yarapathineni srinivasa rao)ఏపీ పాలనపైనా..సీఎం జగన్ (CM Jagan) పైనా మండిపడ్డారు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో చంద్రబాలు అత్యంత కీలమని..ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అభివృదికి మూలం చంద్రబాబు అని అన్నారు. కానీ పరిపాలన చేతగాని వ్యక్తి, లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి సైకో జగన్ అంటూ మండిపడ్డారు. అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబు ని జైలుకి పంపారు అంటూ విమర్శించారు. ప్రజల్లో చంద్రబాబు యాత్ర,యువగళంతో లోకేష్ పాదయాత్రలు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంటే చూసి ఓర్వలేక..తట్టుకోలేక ఇటువంటి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయించారు అంటూ మండిపడ్డారు. పక్కా ప్లాన్ తోనే అక్రమ కేసులు బనాయించారని..ఈ రోజు మరో మూడు చార్జ్ షీట్ లు వేస్తున్నారు..చంద్రబాబును సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు జైలులో వుంచాలని ప్లాన్ వేస్తున్నారు అంటూ ఆరోపించారు.

Chandrababu : జైల్లో చంద్రబాబు ఉదయాన్నే లేచి ఏం చేశారో తెలుసా..?

ప్రజల్లో తిరిగే ధైర్యం లేని జగన్ పరదాలు కట్టుకుని తిరిగతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా పరదాలు కట్టుకునే తిరిగే జగన్ కు ప్రజల్లోకొచ్చి మాట్లాడే ధైర్యంలేదంటూ సెటైర్లు వేశారు. అప్పుడు పాదయాత్రలు చేసి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు పాదయాత్ర చేసే దమ్ముందా..? అంటూ ప్రశ్నించారు. వ్యవస్థ లు మేనేజ్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ విమర్శించారు. మీమీద ఉండే కేసులు ముందుకెళ్లకుండా మ్యానేజ్ చేసుకుంటు మరోపక్క ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు రోడ్డు మార్గంలో వచ్చారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు..కానీ 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబుకు పబ్లిసిటీ ప్రత్యేకించి అవసరంలేదన్నారు.

ఏపీలో అక్రమాలకు..రాజకీయ సలహాదారుగా ఉన్న సజ్జల చంద్రబాబు, లోకేష్ ని పాతాళానిక తొక్కుతామని పెద్దపెద్ద పదాలు వాడుతున్నారని అది మీ వల్ల కాదు అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అనుచిత పోస్టులు పెడుతున్నారని..ఏపీలో అరాచక పాలన చేస్తున్న మీపాపాలు పండే రోజు దగ్గరలోనే వుందన్నారు. మీరు చంద్రబాబు మీద లోకేష్ మీద చంద్రబాబు సతీమణి గురించి మీరు,మీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి..?  అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిస్తున్న సజ్జలా..మీ అరాచకాలను చూస్తూ ఊరుకోము అంటూ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మీద .. లోకేష్ మీద మీరు కేసులు పెట్టి ఇబ్బందులు పెడటాన్ని కేంద్ర నాయకులు ఖండిస్తున్నారనే విషయం గుర్తించాలన్నారు.

Balakrishna : చంద్రబాబు అరెస్ట్‌తో బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం, దేనికైనా రెడీ అన్న బాలయ్య బాబు

మీ సొంత బాబాయిని చంపిన రక్త చరిత్ర మీది..అవినాష్ రెడ్డిని జైలుకు పోకుండా వ్యవస్థలను మానేజ్ చేసింది మీరు కాదా సజ్జలా..? అంటూ ప్రశ్నించారు.నోటికి ఎంత వస్తే అంత వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలు మీ అధికారం పోయిన రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండీ అంటూ సూచించారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మా నాయకుడు చంద్రబాబుకు ప్రాణ హాని జరిగితే మీ సంగతి తేలుస్తాం..అంటూ హెచ్చరించారు. మంత్రి రోజా .. చంద్రబాబు నాయుడు జైలుకు పోతే స్వీట్లు పంచుతోంది..మేము అధికారంలోకి రాగానే నీపైన ఎంక్వైరీ వేస్తాం..అప్పుడు పంచుకో స్వీట్లు అంటూ ఎద్దేవా చేశారు. మేయర్ లాఠీ పట్టుకుని వీధుల్లో తిరిగారు. లాఠి పట్టుకుని రోడ్డు మీద తిరగటానికి మేయర్ ఎవరు..? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఎస్పీ చూస్తూ ఊరుకున్నారు..మీకు సిగ్గనిపించటం లేదా..? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు.

గతంలో మీక్యాబినెట్లో మంత్రులే మీ వైసీపీ ప్రభుత్వం గురించి నీచంగా మాట్లాడారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.అసలు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఉందా…? అని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ లో కొత్త విధానం తెచ్చి ప్రజల ఆస్తుల తాకట్టు పెట్టబోతున్నారు అంటూ ఆరోపించారు.చంద్రబాబు ను అరెస్ట్ చేశామని వైసీపీ నేతలు, జగన్ సంబరపడిపోతున్నారని..కానీ చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ మోహన్ రెడ్డి సరిదిద్దు కాలేని తప్పు చేసారు అంటూ మండిపడ్డారు. దీనికి ఇంతకు ఇంత మీకూ ఉంటుంది…త్వరలోనే మీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం,గుర్తు పెట్టుకోండి..అంటూ హెచ్చరించారు.రాష్ట్రంలో ప్రజలు వైసీపీని గొయ్యి తీసి కప్పేయటానికి సిద్దంగా ఉన్నారన్నారు.ఛీప్ లిక్కర్ వల్ల ఎంతోమంది అమాయకులు బలైపోయారని విమర్శఇంచారు.జైలు లో‌చంద్రబాబుకి భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్.