Balakrishna : చంద్రబాబు అరెస్ట్‌తో బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం, దేనికైనా రెడీ అన్న బాలయ్య బాబు
పార్టీ తరపున ఏ కార్యక్రమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీనియర్ నేతలతో చెప్పారట బాలకృష్ణ. తాను చేయాల్సిన కార్యక్రమాల గురించి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలని కోరారట. Balakrishna - Chandrababu Arrest

Balakrishna - Chandrababu Arrest
Balakrishna – Chandrababu Arrest : అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు సమావేశం అయ్యారు. బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్, ఆలపాటి రాజా, అనురాధ, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, పట్టాభి రామ్ సహా ఇతర సీనియర్ నాయకులు భేటీ అయ్యారు.
చంద్రబాబు జైల్లో ఉండటంతో భవిష్యత్తు కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు బాలయ్య. నెక్ట్స్ ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అనేదానిపై ఈ సమావేశంలో డిస్కస్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందుబాటులో ఉన్న సీనియర్ నేతలంతా భేటీ అయ్యారు. ఈ భేటీకి బాలయ్య కూడా హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానిపై చర్చించారు. చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్ కి మోరల్ గా సపోర్టు ఇవ్వాల్సిన సమయం ఆసన్నం అయిందని, పార్టీ తరపున ఏ కార్యక్రమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీనియర్ నేతలతో చెప్పారట బాలకృష్ణ.
అందరం కూర్చుని చర్చించుకుని భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుందాని చెప్పారట. అవసరమైతే ఎక్కడైనా పర్యటించాల్సి వస్తే అందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నానని నేతలతో బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం. తాను చేయాల్సిన కార్యక్రమాల గురించి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలని కోరారట. మీరు చెప్పినట్లు నేను నడుచుకుంటాను అని సీనియర్ నేతలతో బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలంతా బాలయ్యతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అవసరమైతే రాష్ట్ర పర్యటన చేయడానికి కూడా తాను సిద్ధం అని సీనియర్లతో బాలక్రిష్ణ చెప్పినట్లుగా తెలుస్తోంది.