Kanakamedala
AP movie tickets Controversy say Kanakamedal In Rajyasabha : ఏపీలో ఎన్నో సమస్యలున్నా ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టకుంటే కేవ సినిమా టిక్కెట్ల ధరల మీదనే ఫోకస్ చేస్తోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ జ్యసభకు వెల్లడించారు. ఎన్నో వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్ధాలు,డ్రగ్స్ హబ్ గా మారతోందని రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాలకు ఆలవాలంగా మారుతోందని వెల్లడించారు. మాఫియాలు రాజ్యమేలేలా ఏపీ తయారైందని రాజ్యసభలో ప్రస్తావించారు కనకమేడల.
ఎప్పుడు లేని విధంగా సంక్రాంతికి గుడివాడలో క్యాసినోతో అసాంఘి కార్యక్రమాలకు వైసీపీ మంత్రులు వ్యవహరించారని దీనిపై ఏపీలో పెద్ద వివాదమే రాజుకుందని తెలిపారు. అభివృద్ది అనే మాట మర్చిపోయి..అభివృద్ధి చేయటం అనే మాటను పక్కను పెట్టి అనవసర వివాదాలకు కేంద్రంగా ప్రభుత్వం మారుతోందని అన్నారు. సినిమా టిక్కెట్ల రగడకు ప్రభుత్వం బీజం వేసిందని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా టార్గెట్ రాజకీయాలను పెంచి పోషిస్తోందన్నారు.
దాంట్లో భాగంగానే హీరో పవన్ కళ్యాన్ సినిమాను ఆపేందుకు టిక్కెట్ల ధరల విషయాన్ని రాజకీయం చేసిందన్నారు. టిక్కెట్ ధరలను రెగ్యురేట్ చేస్తోందని..వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసిందని..దీని వల్ల ఏపీలో పలు సినిమాలు విడుదల చేయటానికి ఆయా సినిమాల ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపించటంలేదని తెలిపారు.
ప్రభుత్వం టిక్కెట్ ధరల వివాదం వల్ల ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయని..ఈ వివాదం వల్లనే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విడుదల చేయకుండా ఆపివేసుకుంటున్నారని తెలిపారు. YCP ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో వాణిజ్య వాతావరణం నాశనమవుతోందని వివరించారు. టార్గెల్ అజెండాగానే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దీని వల్ల రాష్ట్రం పలు విధాల నష్టపోతోందని రాజ్యసభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ కనకమేడల.
రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాకపోగా పరిశ్రమల స్థాపనకు ముందకు వచ్చిన వారు కూడా పక్క రాష్ట్రాలకి తరలిపోయారంటూ ఎంపీ కనకమేడల మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతో చివరకి సినిమా టిక్కెట్ల వ్యవహారంలోనూ తలదూర్చిందని తీవ్రంగా విమర్శించారు.