Chandrababu
Chandrababu:Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. సీఎంగా గెలిస్తేనే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని అన్నారు. నా కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నా భార్య శీలాన్ని కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలు భరించా. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్లీ సీఎం అయిన తర్వాతే సభలో అడుగుపెడతా అన్నారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అలా అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.
అంతకంటే ముందు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ మార్షల్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. శాసనసభలోకి చంద్రబాబు ఇతర కీలక నేతలతో కలిసి వెళ్తుండగా సదరు మార్షల్ ఫోన్‌తో విజువల్ షూట్ చేశాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. మార్షల్‌ను చంద్రబాబు భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న చీఫ్ మార్షల్.. చంద్రబాబు వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు. మార్షల్ చర్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
………………………………….: టీమిండియా హెడ్ కోచ్ పదవి.. పాంటింగ్ నో చెప్పడంతోనే..