Ricky Ponting: టీమిండియా హెడ్ కోచ్‌ పదవి.. పాంటింగ్ నో చెప్పడంతోనే..

టీమిండియాలో కొత్త అధ్యాయం లిఖించేందుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. రవిశాస్త్రి తర్వాత ఆ పదవిని అందుకున్న ద్రవిడ్.. ఆ పదవికి ఫస్ట్ ఛాయీస్ కాదట. ఈ విషయాన్ని...

Ricky Ponting: టీమిండియా హెడ్ కోచ్‌ పదవి.. పాంటింగ్ నో చెప్పడంతోనే..

Ricky Ponitin

Ricky Ponting: టీమిండియాలో కొత్త అధ్యాయం లిఖించేందుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. రవిశాస్త్రి తర్వాత ఆ పదవిని అందుకున్న ద్రవిడ్.. ఆ పదవికి ఫస్ట్ ఛాయీస్ కాదట. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ చెప్తున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఎడిషన్ జరుగుతుండగా.. తనను టీమిండియాకు హెడ్ కోచ్ గా వ్యవహరించాలంటూ కోరారట. కచ్చితంగా ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని బాగా ప్రయత్నించారు కూడా. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండటంతో తాను రెడీగా లేనని చెప్పేశాడట.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అధికారిక సలహాదారు సౌరవ్ గంగూలీ. హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్. ఇదిలా ఉంటే తానెప్పుడూ ఐపీఎల్ ఫ్రాంచైజీలో, చానెల్ 7లో తన పదవులు వదులుకోవడానికి రెడీగా లేనని అన్నారు. పాంటింగ్ కూడా ఢిల్లీ జట్టుకు కోచ్ గా సక్సెస్ అయ్యారు.

…………………… : వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేశాకే ఆందోళనలు ముగిస్తాం : రాకేష్ టికాయత్

పాంటింగ్.. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక అవడం పట్ల ఆశ్చార్యాన్ని కూడా వ్యక్తం చేశాడు. ‘ద్రవిడ్ ఆ పదవి తీసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అండర్-19 కోచ్ గా అతనెంత హ్యాపీగా ఉన్నాడో చాటింగ్ లో చర్చించుకున్నాం. అతను ఫ్యామిలీకి సమయం ఎంత కేటాయిస్తాడో తెలీదు. అందుకే ఈ పదవి తీసుకోవడం అలా అనిపించింది’ అంటున్నాడు పాంటింగ్.