Rakesh Tikait : వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేశాకే ఆందోళనలు ముగిస్తాం : రాకేష్ టికాయత్

వ్వయసాయ చట్టాలను రద్దు చేశామని ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ ఈ చట్టాలను పార్లమెంట్ రద్దు చేశాకే ఆందోళలు ముగిస్తామని అప్పటివరకు కొనసాగిస్తామని రైతునేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు

Rakesh Tikait : వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేశాకే ఆందోళనలు ముగిస్తాం : రాకేష్ టికాయత్

Farmers Protests To Continue Till Farm Laws Are Repealed In Parliament (1)

Rakesh Tikait : రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయినా రైతు సంఘాల నేతల తమ నిరసనలు కొనసాగిస్తామని చెబుతున్నారు. ఎందుకంటే సాగు చట్టాలను రద్దు చేశామని ప్రధాని నోటి మాట సరిపోదని..ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తరువాతే తమ ఆందోళనలు ముగిస్తామని అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు.

Read more : Farm Laws Repeal : కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

కాగా జాతిని ఉద్ధేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ..రైతులు వ్యతిరేకించే మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన తరువాత రాకేశ్ టికాయత్ సంతోషం వ్యక్తంచేశారు. రైతులకు ప్రధాని తీసుకున్న నిర్ణయం సంతోష దాయకమే.. కానీ పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తరువాత  మరింత ఆనందం కలుగుతుందని స్పష్టంచేశారు. పార్లమెంట్ లో సాగు చట్టాలను రద్దు చేసిన తరువాతే తమ ఆందోళన పూర్తిగా విరమిస్తామని అప్పటి వరకు కొనసాగిస్తామని శుక్రవారం (నవంబర్ 19,2021) ప్రధాని ప్రకటన తరువాత టికాయత్ తన ట్విట్టర్ ద్వారా హిందీలో రాసి స్పష్టంచేశారు.

Read more : Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు

గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ జాతిని ఉధ్ధేశించి ప్రసంగిస్తూ.. రైతులకు నష్టం చేసే ఏ పనీ ప్రభుత్వం చేయదని.. రైతుల బాధల్ని తాము అర్థం చేసుకున్నామని.. మూడు వ్యవసాయ చట్టాలను వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేస్తామని ప్రధాని స్పష్టంచేశారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతోనే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు స్పష్టంచేసిన ప్రధాని మోడీ.. కొత్త చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించడంలో విఫలం చెందామని.. రైతుల ఆందోళనలతో వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించామని వెల్లడించారు.

Read more : New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

కొత్త చట్టాల కారణంగా రైతులకు కలిగిన ఇబ్బందులకు తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలుచోట్ల రైతు సంఘాలు వేడుకలు జరుపుకుంటున్నారు. మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.పలువురు ప్రముఖులు రైతులకు అభినందనలు తెలుపుతున్నారు.

Read more : Farm Laws : వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఐదు కారణాలు!