Farm Laws : వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఐదు కారణాలు!

రైతుల కోసమే ఈ చట్టాలు అన్నారు. రైతుల మేలు కోసం తాము ఈ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని గొంతెత్తి అరుస్తున్నా..కేంద్రం వినిపించుకోలేదు.

Farm Laws : వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఐదు కారణాలు!

Five Reasons Govt To Repeal 3 New Farm Laws

3 New Farm Laws : రైతుల కోసమే ఈ చట్టాలు అన్నారు. రైతుల మేలు కోసం తాము ఈ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని గొంతెత్తి అరుస్తున్నా..కేంద్రం వినిపించుకోలేదు. ఎన్నో రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా కుటుంబాలను వదిలి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అయినా…కేంద్రం చెవికి వారి డిమాండ్స్ వినిపించుకోలేదు. చివరకు అనూహ్యంగా..వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత సడన్‌గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది…? అనే చర్చ కొనసాగుతోంది. దీని వెనుక కారణాలేంటి..??

Read More : Kim Kardashian: అఫ్ఘాన్ మహిళా ప్లేయర్ల కోసం కిమ్ కర్దాశియన్ స్పెషల్ ఫ్లైట్

ముఖ్యంగా కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.. రైతు ఆందోళనల్లో పాల్గొనే మేజారిటీ రైతులంతా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారే. దీంతో ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై తప్పకుండా పడే అవకాశం ఉందని బీజేపీ ప్రభుత్వం గ్రహించింది. దీంతో చట్టాలను వెనక్కి తీసుకోవడమే సరైన నిర్ణయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read More : Sneha: బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌లో స్నేహ ఫిర్యాదు!

దీనికి తోడు నూతన వ్యవసాయ చట్టాలను తమ అస్త్రంగా మార్చుకొని ప్రచారాన్ని ప్రారంభించాయి విపక్షాలు.. పంజాబ్‌, యూపీలో కాంగ్రెస్‌ ఇప్పటికే దీన్ని అస్త్రంగా మలుచుకొని ఎన్టీఏ సర్కార్‌పై విరుచుకపడుతోంది. దీంతో సరిగ్గా కొన్ని నెలల ముందు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో విపక్షాలకు అస్త్రం లేకుండా చేయడమనేది మరో వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఈ నిర్ణయంతో తమది రైతు పక్షపాత ప్రభుత్వమనే చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Read More : Farm Laws Repeal : కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

అంతేగాకుండా 15 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది.. రోజుకో తీరుతో వాళ్లు ఆందోళనలు చేపట్టడం. నిరసనలు రోజురోజుకు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండటం.. ఒక్కో రాష్ట్రం నూతన వ్యవసాయ చట్టాలపై గొంతెత్తుండటంతో మోగుతున్న డేంజర్‌ బెల్స్‌ను ముందే గ్రహించి వెనక్కి తీసుకుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రైతు చట్టాలను కేంద్రం వెనక్కితీసుకోవడంపై.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను గుర్తించి… ఇప్పటికైనా సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు అన్నదాతలు.