Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు

సంవత్సర రోజులకు మించి చేసిన పోరాటం.. వాతావరణ మార్పులకు చలించని  రైతు మొండి ధైర్యం.. మార్పు కోసం ప్రతి పూట ఎదురుచూపులే.. లాఠీ దెబ్బలు.. ఎముకలు కొరికే చలి, గుండెలెండి పోయేంత ఎండ..

Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు

Farmer Laws

Three Farm Laws: సంవత్సర రోజులకు మించిన పోరాటం.. వాతావరణ మార్పులకు చలించని మొండి ధైర్యం.. మార్పు కోసం ప్రతి పూట ఆశగా చూసిన ఎదురుచూపులతో.. లాఠీ దెబ్బలు.. ఎముకలు కొరికే చలి, గుండెలెండి పోయేంత ఎండ.. ఎన్ని కష్టాలు వచ్చినా కదలలేదు. ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన పోరాటాలు ఇవే వారి ఆయుధాలు.

పోయిన ప్రాణాలకు బదులు అడక్క.. అవన్నీ త్యాగాలే అని సర్దుకుని పట్టు సడలకుండా.. పట్టుదల వీడకుండా చేసిన రైతుల పోరాటం ఎట్టకేలకు విజయకేతనం ఎగరేసింది. కేంద్రం దిగొచ్చి రైతు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

యావత్ ప్రపంచం స్పందించి ఈ నిరసనపై పలు కామెంట్లు చేసింది. దేశంలో కీలక నేతలు పలు రకాలుగా స్పందించారు. వ్యవసాయమేదో.. వ్యర్థమేదో తెలియని వారు సైతం మైకుల్లో మాటలు కక్కారు. వ్యవసాయ బిల్లుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కీలక తేదీల వివరాలిలా ఉన్నాయి.

…………………………………………………….. : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

జూన 5 – 2020
వ్యవసాయ చట్టాల రూపకల్పన

సెప్టెంబర్ 14 – 2020
పార్లమెంట్ లోకి వ్యవసాయ బిల్లు

సెప్టెంబర్ 17 – 2020
బిల్లులకు లోక్ సభ ఆమోదం

సెప్టెంబర్ 20 – 2020
బిల్లులకు రాజ్యసభ ఆమోదం

సెప్టెంబర్ 27 – 2020
3 వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

నవంబర్ 25 – 2020
వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానా రైతుల చలో ఢిల్లీ

నవంబర్ 28 – 2020
రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

డిసెంబర్ 3 – 2020
రైతులు, కేంద్రం మధ్య మొదటి విడత చర్చలు

డిసెంబర్ 5 – 2020
రైతులు, కేంద్రం రెండో విడత చర్చలు.. విఫలం

డిసెంబర్ 8 – 2020
భారత్ బంద్ కు రైతు సంఘాల తొలి పిలుపు

డిసెంబర్ 9 – 2020
చట్టాల సవరణ ప్రతిపాదనలు తిరస్కరించిన రైతులు

డిసెంబర్ 11 – 2020
సుప్రీం కోర్టును ఆశ్రయించిన రైతు సంఘాలు

డిసెంబర్ 13, 2020
కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ రైతు ఆందోళనల్లో తుక్‌డే తుక్‌డే హస్తముందని రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

డిసెంబర్ 16 – 2020
సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీం

డిసెంబర్ 21 – 2020
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరాహార దీక్ష

డిసెంబర్ 30, 2020
ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ బిల్, గడ్డి తగలబెట్టడంపై జరిమానా వంటివి తీసేస్తామంటూ ఆరో రౌండ్ చర్చల్లో ప్రభుత్వం హమీ ఇచ్చింది.

జనవరి 4, 2020
ఏడోసారి జరిగిన చర్చల్లో రైతు చట్టాలు రద్దును కేంద్రం మరోసారి తిరస్కరించింది.

జనవరి 7 – 2021
రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్న విచారణకు సుప్రీం అంగీకారం

జనవరి 11 – 2021
వ్యవసాయ చట్టాలు తెచ్చిన తీరుపై సుప్రీం సీరియస్

జనవరి 12 – 2021
3 వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం స్టే

జనవరి 26 – 2021
రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద రైతుల ఆందోళన ఉధృతం

జనవరి 28, 2020
ఢిల్లీలోని ఘాజీపూర్ బోర్డర్‌లో ఆందోళనలు మొదలుపెట్టాక.. యూపీలో ఘాజియాబాద్ రాత్రికి రాత్రే సైట్ ఖాళీ చేయాలంటూ ఆర్డర్ వేసింది.

ఫిబ్రవరి 5, 2020
రైతు ఉద్యమంపై సోషల్ మీడియాలో టూల్ కిట్ ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఫిబ్రవరి 6 – 2021
చక్కా జామ్ నిర్వహించిన రైతులు

ఫిబ్రవరి 8 – 2021
రైల్ రోకో చేసిన రైతులు

ఫిబ్రవరి 9, 2020
పంజాబీ యాక్టర్ దీప్ సింధు కార్యకర్తగా మారి రిపబ్లిక్ డే ఆందోళనలో పాల్గొన్నాడంటూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసి.. 7రోజుల పాటు కస్టడీలో ఉంచింది.

ఫిబ్రవరి 18, 2020
సంయుక్త కిసాన్ మోర్చా (SKM) దేశవ్యాప్త ‘రైల్ రోకో’ నిరసనకు పిలుపునిచ్చింది.

మార్చి 02, 2021:
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఇతర పార్టీ నాయకులను ఛండీగఢ్ పోలీసులు సెక్టార్ 25 నుండి సోమవారం మధ్యాహ్నం పంజాబ్ విధానసభ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 6 – 2021
వ్యవసాయ చట్టాలపై రైతు ఉద్యమానికి వంద రోజులు

ఏప్రిల్ 15, 2021:
హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలను పునఃప్రారంభించాలని, వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభనపై “సామరస్యపూర్వక ముగింపు”కు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు .

ఏప్రిల్ 26, 2021:
దీప్ సిద్ధూకి రెండో బెయిల్.

మే 27 – 2021
సాగు చట్టాలపై బ్లాక్ డే నిర్వహించిన రైతులు

జూన్ 5, 2021:
వ్యవసాయ చట్టాలను ప్రకటించి సంవత్సరం అయిందనే దానికి గుర్తుగా నిరసన తెలిపిన రైతులు.. సంపూర్ణ క్రాంతికారి దివస్‌ని పాటించారు.

జూన్ 26, 2021:
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఏడు నెలల నిరసనకు నిదర్శనంగా ఢిల్లీకి మార్చ్ చేశారు.

ఆగస్ట్ 7, 2021:

14 ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంట్ హౌస్‌లో సమావేశం

నవంబర్ 19 – 2021
సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటన

……………………………………….: తగ్గేదేలే.. వచ్చే వారం ఓటీటీలో రచ్చ రచ్చే!