Breaking Corona Rules: టీచర్ పెళ్లి.. రూ.2 లక్షలు ఫైన్ వేసిన అధికారులు

ఫిబ్రవరి నుంచి ముహుర్తాలు లేకపోవడంతో చాలామంది మే, జూన్ నెలల్లో పెళ్లి చేసుకోవాలని ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వేడుకలు చేయాలనుకునేవారు తప్పని సరి తహసీల్దార్ పర్మిషన్ తీసుకోవాలని ప్రభుత్వం విడుదల చేసిన సెర్క్యూలర్ లో తెలిపింది.

Breaking Corona Rules

Breaking Corona Rules: ఫిబ్రవరి నుంచి ముహుర్తాలు లేకపోవడంతో చాలామంది మే, జూన్ నెలల్లో పెళ్లి చేసుకోవాలని ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వేడుకలు చేయాలనుకునేవారు తప్పని సరి తహసీల్దార్ పర్మిషన్ తీసుకోవాలని ప్రభుత్వం విడుదల చేసిన సెర్క్యూలర్ లో తెలిపింది.

అయితే చాలామంది ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి వేడుక నిర్వహించినందుకు అధికారులు రూ.2 లక్షలు ఫైన్ విధించారు.

ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పాతపట్నం మండలం చంద్రయ్యపేట గ్రామానికి చెందిన టీచర్ రాంబాబు తన పెళ్లి నిమిత్తం పాతపట్నం తహసీల్దార్ వద్ద పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చే సమయంలో తహసీల్దార్ కరోనా నిబంధనలను రాంబాబుకు వివరించాడు. పెళ్ళిలో 20 మంది మాత్రమే ఉండాలని తెలిపాడు. తహసీల్దార్ చెప్పినంతసేపు తల ఊపిన రాంబాబు. పెళ్లిరోజు నిబంధనలు తుంగలో తొక్కాడు.

శుక్రవారం పెళ్లి జరుగుతుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు పెళ్లి వేడుక వద్దకు వెళ్లారు. పెళ్ళిలో సుమారు 250 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా నిబంధనలు ఉల్లగించినందుకు గాను రూ. 2 లక్షల ఫైన్ విధించారు. ఈ సందర్బంగా సీఐ ఎండీ అమీర్ మాట్లాడుతూ.. కరోనా తీవ్రత అధికంగా ఉందని.. ప్రజలు అర్ధం చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.