Adimulapu Suresh : నూతన విద్యావిధానంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దు

జాతీయ నూతన విద్యావిధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 

Teachers Need Not Worry About The New Education System

Adimulapu Suresh : జాతీయ నూతన విద్యావిధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.  ఉపాధ్యాయులు దీనిపై ఎటువంటి అపోహలు చెందవద్దని… విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకుంటున్న కొన్ని చర్యలపై ఉపాధ్యాయులు రకరకాల ఊహగానాలు తెస్తున్నారని అన్నారు.

ప్రస్తుతం వీటి అమలుపై చర్యలు పరిశీలన ప్రాధమిక దశలోనే ఉన్నాయని, ఉపాధ్యాయుల నుంచి సూచనలు, సంఘాల ప్రతిపాదనలు తీసుకోవాలని ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ను ఆదేశించామని తెలిపారు. త్వరలో పరిస్థితిని బట్టి భౌతికంగా గాని లేదా వర్చువల్ విధానంలో కానీ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి సురేష్ చెప్పారు.