Lord Rama Tears : రాముడి కంట కన్నీరు.. ఆందోళనలో గ్రామస్తులు..

ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వింతగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు.

Lord Rama Tears : ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వింతగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకటయి తండాలోని సమ్మక సారలక్క ఆలయంలో రాముడి విగ్రహం ఉంది. విగ్రహం ఎడమ కంటి నుంచి నీళ్లు కారుతున్నాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన వారంతా ఆ వింతను చూడటానికి క్యూ కట్టారు. ఇది మానవ జాతికి రాబోతున్న ముప్పుకు సంకేతమని కొందరు అంటే.. ప్రస్తుతమున్న వైపరిత్యాల నేపథ్యంలో రాములోరు కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ రకరకాలుగా చెబుతున్నారు.

ఐదేళ్లుగా రాముడికి కళ్యాణం జరిపిస్తున్నారు గ్రామస్తులు. అయితే, తన కలలో శ్రీరాముడు కనిపించి, కన్నీరు పెట్టుకున్నారని, ఆలయానికి వచ్చి చూడగా, అది నిజంగానే జరిగిందని, ఆలయ పూజారి చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. కాగా, గత 50ఏళ్లుగా ఇలా ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు.

ఈ ఘటనపై తండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి అరిష్టం జరగబోతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అరిష్టం జరగకుండా రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు