Cm Chandrababu Helicopter: ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనకు వాడే హెలికాప్టర్ లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు అదే హెలికాప్టర్ కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇదే హెలికాప్టర్ లో వెళ్లేలా షెడ్యూల్ ఇచ్చారు. పీయూష్ గోయల్ హెలికాప్టర్ లో ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్నారు.
వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలపై అధికారులు అలర్ట్ అయ్యారు. సీఎం వాడే హెలికాప్టర్ లో సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. హెలికాప్టర్ లో టెక్నికల్, సెక్యూరిటీ సమస్యలపై నివేదించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఆదేశించారు. హెలికాప్టర్ ను వాడొచ్చా? లేదా? అన్న దానిపై నివేదిక ఇవ్వాలన్నారు.