AP cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్‌ సంస్కరణలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

Ap Cabinet Meeting

AP cabinet key decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్‌ సంస్కరణలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. తొలివిడత నాడు- నేడు కోసం 3 వేల 669 కోట్ల ఖర్చు చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది విద్యా కానుకకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ నెలలో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు పథకాలపై మంత్రివర్గం చర్చించింది. హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని.. కర్నూలులో ఏర్పాటు చేసేందుకు, లోకాయుక్తను కర్నూలుకు తరలించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి.., మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలకు ఆమోదముద్ర వేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులకు కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.