AP 10th Exams Important Changes
AP 10th Exams Important Changes : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరు సబ్జెక్ట్‌లకు ఆరు పేపర్లు మాత్రమే ఉంచాలని నిర్ణయించింది.
కోవిడ్ కారణంగా గతంలో ఉన్న 11పేపర్లను 7 పేపర్లకు కుదించింది. ఇప్పుడు 7 పేపర్లను ఆరు పేపర్లుగా కుదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్‌కు కలిపి ఒకే పేపర్‌గా నిర్ణయించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
AP govt : ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
ఏడాది పొడవునా పరీక్షలు నిర్వహిస్తున్నందున 11పేపర్లు అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2024-25 నుంచి సీబీఎస్ఈ బోర్డుతో కలిపి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.