Amaravati : కార్పొరేషన్ గా అమరావతి..!

మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్‌లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు.

Amaravati 11zon

Amaravati Capital City Corporation : ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో ఆగిపోయిన అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రక్రియను మళ్లీ మొదలు పెట్టింది. ఆ ప్రాంతంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండంలలోని 3 గ్రామాలు కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు కార్యాచరణ పున: ప్రారంభించింది. మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్‌లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు.

ఎల్లుండి నుంచి 11 వరకు ఆరు రోజుల పాటు గ్రామసభలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. గతంలో ఇదే ప్రతిపాదనతో గ్రామసభలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నించగా రాజధాని రైతులు అడ్డుకున్నారు. అయితే తాజాగా ఈ పక్రియను మొదలుపెట్టనున్నారు.

CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌ను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని ఏర్పాటు కుట్రపూరితమైనదని రాజధాని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన 29 గ్రామాలను కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే గ్రామసభలను అడ్డుకోరాదని అమరావతి రాజధాని జేఏసి నిర్ణయం తీసుకుంది.

గ్రామసభల్లో తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలుపాలని నిశ్ఛయించారు. సభలను వీడియోగ్రఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ అభిష్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళితే హైకోర్టును ఆశ్రయిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు.