Tidco House
Tidco house for one rupee : ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మునిసిపాలిటీల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో ఇల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపాయకే అందించనుంది. మునిసిపాలిటీల్లో షియర్ వాల్ సాంకేతికతతో జీ+3 అపార్ట్ మెంట్ తరహాలో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,43,600చ ఇళ్లను ఒక్క రూపాయకే లబ్ధిదారులకు అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది. 365 చదరపు అడుగుల ఇంటికి రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటికి రూ.లక్ష తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా ఇందులో 50 శాతం రాయితీకి అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే పూర్తిగా చెల్లించిన వారికి సంగం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. లబ్ధిదారుని వాటా ఇప్పటికే చెల్లించినప్పటికీ వైసీపీ ప్రభుత్వ ఇళ్ల స్థలాల పథకం వైపు మళ్లిన వారికి పూర్తి మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు టిడ్కో కాలనీలుగా ఉన్న పథకం పేరును ప్రధానమంత్రి ఆవాస్ యోజన-వైఎస్సార్ జగనన్న నగర్ గా మార్పుచేస్తున్నట్లు పేర్కొంది.