AP High Court : స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఎస్ఈసీ తీరును తప్పుబట్టిన ఏపీ హైకోర్టు

స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఎస్ఈసీ తీరును ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఈస్ట్ గోదావరి పెద్దాపురం పులిమేరు ఎంపీటీసీ 25 బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.

High Court (1)

AP High Court erred over SEC : స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ఎస్ఈసీ తీరును ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఈస్ట్ గోదావరి పెద్దాపురం పులిమేరు ఎంపీటీసీ 25 బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 24, 25, 26 బూతులలో కొత్తగా ఎన్నికల నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో కౌంటింగ్ సమయంలో 25వ బూతు కౌంటింగ్ బాక్స్ లో కొన్ని ఓట్లు చెదలుపట్టాయని.. ఈ నేపథ్యంలో 25వ బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్, ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారని జనసేన లీగల్ చైర్మన్ సాంబశివప్రతాప్ ధర్మాసనానికి వివరించారు.

Srabanti Chatterjee: బీజేపీకి షాక్.. నటి స్రబంతి రాజీనామా!

గతంలో కౌంటింగ్ సమయంలో జనసేన అభ్యర్థికి 100 ఓట్లు మెజారిటీ వచ్చిందని న్యాయవాది తెలిపారు. మళ్ళీ ఇప్పుడు 24, 25, 26 బూతులలో కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చిందని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

రెండోసారి విడుదల చేసిన ఎస్ఈసీ నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ముందు 25వ బూతుకు రీపోలింగ్ డిక్లేర్ చేసి…మళ్ళీ ఇప్పుడు 24, 25, 26 బూతులలో కొత్తగా ఎన్నికలు పెట్టడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.