అనంతపురం జిల్లాలో దారుణం… ప్రేమించిన యువతిని హత్య చేసిన ప్రియుడు

  • Publish Date - November 25, 2020 / 04:12 PM IST

boyfriend murder girlfriend : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు. వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతిని ప్రియుడు కణేకల్‌ సమీపంలోకి హెచ్‌ఎల్‌సీ కాల్వలో తోసేసి హత్య చేశాడు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం చాపిరిలో చోటుచేసుకుంది.



చాపిరికి చెందిన షహిదా, రఘు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో.. తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డుచెప్పి.. ఇద్దరికీ వేరే వారితో పెళ్లి ఫిక్స్‌ చేశారు. ఇది నచ్చని రఘు, షహిదాను తీసుకుని వారం క్రితం గ్రామం నుంచి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత రఘు తిరిగి వచ్చాడు.



https://10tv.in/bangladeshi-woman-without-valid-visa-arrested-at-minjur/
షహిదా తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రఘును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కణేకల్‌ హెచ్‌ఎల్‌సీ కాల్వలో యువతి మృతదేహం గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌ ముందు యువతి కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.