Congress Bharat Jodo Yatra
Congress Bharat Jodo Yatra : కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలైంది. ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు పాదయాత్ర చేరుకోనుంది. మళ్లీ సాయంత్రం 04.30 గంటలకు పాదయాత్ర మొదలు కానుంది. సాయంత్రం 6.30 గంటలకు అనంతపురం జిల్లా ఓబులాపురం గ్రామంలో పాదయాత్ర ఆగనుంది.
రాత్రికి తిరిగి కర్ణాటక బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. భారత్ జోడో యాత్రికులు, రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు.
DK Shivkumar: ‘భారత్ జోడో యాత్ర’.. టీ షర్టు ధరించి బీజేపీకి కౌంటరిచ్చిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే రూట్లో ఏర్పాట్లను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు పరిశీలించారు. ఏపీలో 5 రోజుల పాటు భారత్ జోడో యాత్ర సాగనున్నారు.