DK Shivkumar: ‘భారత్ జోడో యాత్ర’.. టీ షర్టు ధరించి బీజేపీకి కౌంటరిచ్చిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధరించిన టీ షర్టు సంచలనంగా మారింది. బీజేపీని విమర్శిస్తూ టీ షర్ట్‌పై కన్నడలో ఒక కొటేషన్ రాశారు.

DK Shivkumar: ‘భారత్ జోడో యాత్ర’.. టీ షర్టు ధరించి బీజేపీకి కౌంటరిచ్చిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్

DK Shivkumar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో విజయవంతంగా కొనసాగుతోంది. గత నెల 7న ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికి 905 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మొత్తం 12 రాష్ట్రాల మీదుగా సాగే ఈ యాత్ర జమ్ము-కాశ్మీర్‌లో ముగుస్తుంది.

Flying Car: దుబాయ్‌లో ఎగిరిన మొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్.. పైలట్ లేకుండానే ఎగిరిన కారు

కాగా, కర్ణాటకలో యాత్ర సందర్భంగా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ధరించిన టీ షర్ట్ సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా కొటేషన్ ఉన్న టీ షర్ట్‌ను శివ కుమార్ ధరించారు. ఎరుపు రంగు టీ షర్ట్‌పై, పసుపు రంగు ప్రింట్ అయి ఉంది. ఈ పసుపు రంగు మధ్యలో ‘యువతకు ఉద్యోగాలు కావాలి. ఉత్త హామీలు కాదు’ అని అర్థం వచ్చేలా కన్నడ భాషలో రాసి ఉంది. ఈ సందర్భంగా శివ కుమార్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిరుద్యోగాన్ని రూపుమాపడంలో విఫలమైంది. మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం మన బాధ్యత. యువత మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ల శక్తిని వాడుకుంటూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి’’ అని శివ కుమార్ వ్యాఖ్యానించారు.

Retail Inflation: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 7.41 శాతంగా నమోదు.. ఆగష్టులో ఏడు శాతమే

ప్రస్తుతం రాహుల్ యాత్ర చిత్రదుర్గా జిల్లాలోని, చల్లకేరెలో సాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దాదాపు 2,000 మంది నిరుద్యోగులతో సమావేశమయ్యారు. నిరుద్యోగుల సమస్యల్ని రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు.