Flying Car: దుబాయ్‌లో ఎగిరిన మొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్.. పైలట్ లేకుండానే ఎగిరిన కారు

మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘ఫ్లయింగ్ కార్’ను తయారీ దారులు దుబాయ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ కారు దాదాపు 90 నిమిషాలపాటు ఎగిరింది. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు.

Flying Car: దుబాయ్‌లో ఎగిరిన మొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్.. పైలట్ లేకుండానే ఎగిరిన కారు

Updated On : October 12, 2022 / 7:03 PM IST

Flying Car: త్వరలోనే ‘ఫ్లయింగ్ కార్స్’ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన ప్రయోగాలు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. చాలా వరకు కార్లు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి.

Munugodu: మునుగోడులో రేపు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. హాజరుకానున్న కేటీఆర్

తాజాగా దుబాయ్‌లో ఒక ‘ఫ్లయింగ్ కార్’ను టెస్ట్ రన్ నిర్వహించారు. ఇది ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు కావడం మరో విశేషం. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘ఎక్స్ పెంగ్’ అనే సంస్థ ఈ కారును తయారు చేసింది. ఇందులో ఇద్దరు ప్రయాణించే వీలుంది. దీనికి నాలుగు వైపులా కలిపి, ప్రతి వైపు రెండు చొప్పున మొత్తం ఎనిమిది రెక్కలుంటాయి. మానవ రహితంగా ఈ ‘ఫ్లయింగ్ కారు’ను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 90 నిమిషాలపాటు ఇది ప్రయాణించి, విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ ఫ్లయింగ్ కార్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

గత జూలైలో మనుషులతో ఈ కారు ప్రయాణిచిందని, భవిష్యత్తు ఆవిష్కరణలకు తమ కారు, సాంకేతికత ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో పైలట్ లేకుండానే ప్రయాణించగలిగే ఇలాంటి కార్లు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, దీనికి ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.