Gangaram Matham : ఆ భూములన్నీ టీటీడీవే.. గంగారాం మఠం పిటిషన్‌ ను కొట్టివేసిన కోర్టు

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్‌ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్‌హౌజ్‌తో సహా 3 వేల 402 ఎకరాల భూములు తమవేనంటూ గంగారాం మఠం గతంలో కోర్టును ఆశ్రయించింది.

Ttd

Inam court dismissed petition : తిరుమల తిరుపతి దేవస్థానం, గంగారాం మఠం మధ్య జరుగుతున్న కేసులో ఇనాం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఎస్వీ, వేదిక్‌, వెటర్నరీ వర్సిటీల భూములపై గంగారాం మఠం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 3 వేల 402 ఎకరాల భూములు టీటీడీకి చెందినవేనంటూ తీర్పు ఇచ్చింది.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్‌ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్‌హౌజ్‌తో సహా 3 వేల 402 ఎకరాల భూములు తమవేనంటూ గంగారాం మఠం గతంలో కోర్టును ఆశ్రయించింది. 1998 నుంచి టీటీడీ, గంగారాం మఠం మధ్య వివాదం కొనసాగింది. దీనిపై తుది తీర్పు ఇచ్చిన ఇనాం కోర్టు.. ఆ భూములన్నీ టీటీడీకే చెందుతాయని తెలిపింది