Andhra Pradesh Heavy Rains : ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు..కృష్ణా, గోదావరి నదులకు వరదలు!

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత వాయుగుండం ఏపీ రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం లేకపోయినప్పటికీ.. బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.

Andhra Pradesh Heavy Rains : ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత వాయుగుండం ఏపీ రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం లేకపోయినప్పటికీ.. బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది.

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో సోమ, మంగళవారాల్లో మోస్తరు వానలు కురవనున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం ఒడిశా, ఛత్తీస్‌గడ్ దిశగా కదులుతున్నందున.. దాని ప్రభావం ఏపీపై లేకపోయినా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Rains In Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన

వాయుగుండం ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు