Kurnool Crime : తీపిదొంగ.. స్వీట్ షాపులోకి చొరబడి నగదుతో పాటు మిఠాయిలు చోరీ
సాధారణంగా దొంగలు నగదు, నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్తుంటారు. అయితే ఓ స్వీట్ షాపులోకి చొరబడిన దొంగలు నగదుతోపాటు స్వీట్స్ కూడా దోచుకెళ్లారు.
- kunduru Vinod
- Published On : December 28, 2021 / 12:38 PM IST
Kurnool Crime
Kurnool Crime : సాధారణంగా దొంగలు నగదు, నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్తుంటారు. అయితే ఓ స్వీట్ షాపులోకి చొరబడిన దొంగలు నగదుతోపాటు స్వీట్స్ కూడా దోచుకెళ్లారు. కర్నూలు పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని రాజ్‌విహార్ సెంటర్‌లో ఉన్న మిఠాయిల దుకాణం షెట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి క్యాష్‌బాక్స్ లోని నగదు తీసుకున్నారు. అనంతరం నేతిమిఠాయిలను కూడా తమతో తెచ్చుకున్న సంచిలో వేసుకొని పారిపోయారు.
చదవండి : Kurnool HC Demand : ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం
షట్టర్ పగలగొట్టి ఉండటంతో ఉదయం అటుగా వచ్చిన వాకర్స్ షాపు యజమానికి సమాచారం ఇచ్చారు. వేంటనే షాప్ వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు యజమాని. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు షట్టర్ ఓపెన్ చేసి పరిశీలించారు. నగదుతోపాటు స్వీట్స్ కూడా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. షాపులోని సీసీకెమెరాలతో పాటు చుట్టుపక్కన ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
చదవండి : Kurnool Market : కర్నూలు మార్కెట్ లో రైతు ఆగ్రహం.. సరైన ధర రాలేదని ఉల్లి పంటకు నిప్పు
