Kurnool Market : కర్నూలు మార్కెట్ లో రైతు ఆగ్రహం.. సరైన ధర రాలేదని ఉల్లి పంటకు నిప్పు

కర్నూలు ఆనియన్ మార్కెట్ లో ఓ రైతు కలకలం సృష్టించాడు. ఉల్లి పంటకు నిప్పు పెట్టి కాల్చేశాడు.

Kurnool Market : కర్నూలు మార్కెట్ లో రైతు ఆగ్రహం.. సరైన ధర రాలేదని ఉల్లి పంటకు నిప్పు

Onion Fire (2)

A farmer sets fire to an onion crop : కర్నూలు ఆనియన్ మార్కెట్ లో ఓ రైతు కలకలం సృష్టించాడు. ఉల్లి పంటకు నిప్పు పెట్టి కాల్చేశాడు. క్వింటాల్ ఉల్లికి 400 రూపాయలు కూడా రాలేదన్న ఆవేదనతో తాను తెచ్చిన పంటను దహనం చేశాడు. ఉల్లిపాయలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తాను తెచ్చిన ఉల్లిని మార్కెట్ లొనే దగ్ధం చేశాడు.

పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం, క్వింటాల్ ఉల్లి ధర 400 రూపాయలు కూడా రాకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. హై క్వాలిటీ పంటను మాత్రమే కొనుగోలు చేస్తూ మిగతా వాటిని పట్టించుకోవడంలేదని ఆగ్రహం చేశాడు. వ్యాపారులు, మార్కెట్ అధికారులపై మండిపడ్డాడు.

Road Accident : విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

అత్యంత ప్రసిద్ధి చెందిన కర్నూలు ఆనియన్ మార్కెట్ లో ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాట ధర కల్పిస్తారని మార్కెంట్ తీసుకొస్తున్న సందర్భంలో క్వింటాలుకు కేవలం రూ.340 ఉల్లిని తీసుకుంటున్నారు.

దీంతో పంచలింగాలకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను తెచ్చిన ఉల్లి పంటపై పెట్రోల్ పోసి, దగ్ధం చేశాడు. వ్యాపారులు, అధికారులపై మండిపడ్డాడు. దీంతో మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది.